calender_icon.png 25 December, 2024 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగాళాఖాతంలో అల్పపీడనం

25-12-2024 01:24:17 AM

ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన

అమరావతి, డిసెంబర్ 24: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొన సాగుతున్నది. దీంతో ఏపీలోని కోస్తా జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించిం ది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఉభ య గోదావరి జిల్లాల్లో మోస్తరు నుం చి భారీ వర్షం కురిసింది.

బుధవారం బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు కురుస్తుందని పేర్కొన్నది. సముద్రంలో గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులెవరూ చేపల వేట కు వెళ్లొద్దని సూచించింది. మరోవైపు ఇప్పటికే కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, మచిలీపట్నం పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి.