- నేడు వాయుగుండంగా మారే అవకాశం
- నాలుగు జిల్లాలకు వర్ష సూచన
హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): బంగాళాఖాతంలోని ఉత్త ర అండమాన్ సముద్ర తీరంలో అల్పపీడనం ఏర్పడినట్టు హైదరాబాద్ వా తావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం పశ్చిమవాయవ్య దిశగా కది లి మంగళవారం ఉదయం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం తుఫాన్‌గా రూపాంతరం చేందే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
ఉత్తర తమిళనా డు తీరానికి ఆనుకొని బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో తెలంగాణలోని నా లుగు జిల్లాల్లో మంగళవారం ఓ మో స్తరు నుంచి తెలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. హనుమ కొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.