calender_icon.png 18 January, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగాళాఖాతంలో అల్పపీడనం

16-07-2024 01:00:54 AM

5 రోజులు భారీ వర్షాలు

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి) : పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబో యే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. ఆదిలాబాద్, మంచి ర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగామ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, జోగు లాంబ గద్వాల జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 18,19 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట, వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరిలలో ఒక మోస్తరు వర్షం కురవగా, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.