calender_icon.png 19 January, 2025 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిస్ ఒలింపిక్స్: క్వార్టర్ ఫైనల్‌లో భారత బాక్సర్ లవ్లీనా ఓటమి

04-08-2024 04:50:31 PM

పారిస్: పారిస్ ఒలింపిక్స్ లో భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ మహిళల 75 కిలోల విభాగంలో క్వార్టర్స్ ఫైనల్ లో ఓడిపోయింది. లవ్లీనా చైనా బాక్సర్ లీ కియాన్ పై 1-4 తేడాతో ఓటమి పాలయ్యారు. లవ్లీనా టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. లవ్లీనా 16వ రౌండ్ లో నార్వేకు చెందిన సున్నివా హఫ్ స్టాడ్ ను ఓడించి చివరి 8వ దశకు చేరుకుంది.

క్వార్టర్స్ ఫైనల్ కు మించి వెళ్లలేకపోవడంతో భారత్ బ్యాకింగ్ బృందం పతకం లేకుండా పారిస్ నుంచి తిరిగి రానుంది. ఇదిలా ఉండగా.. శనివారం జరిగిన బాక్సింగ్ పోటీలో నిశాత్ దేవ్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. అటు పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత జట్టు హాకీలో సెమీస్ చేరుకుంది. క్వర్టర్ ఫైనల్ లో భారత హాకీ జట్టు బ్రిటన్ పై పెనాల్టీ షూటౌట్ లో 4-2 గోల్స్ తేడాతో విజయం సాధించారు.