calender_icon.png 19 January, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లవ్లీనాకు నిరాశే

05-08-2024 12:05:00 AM

  1. క్వార్టర్స్‌లో ఓటమి 
  2. ముగిసిన భారత బాక్సర్ల పోరు

పారిస్: ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ల పోరాటం ముగిసింది. ఆదివారం మహిళల 75 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్ లవ్లీ నా బొర్గొహై క్వార్టర్స్‌లో ఓటమిపాలైంది. క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా 1 తేడాతో చైనా బాక్సర్ లి కియాన్ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో ఈసారి విశ్వక్రీడల్లో మన బాక్సర్లు పతకం లేకుండానే రిక్తహస్తాలతో వెనుదిరిగారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాం స్యంతో మెరిసిన లవ్లీనా ఈసారి మాత్రం నిరాశపరిచింది. క్వార్టర్స్ చేరి పతకంపై మరోసారి ఆశలు పెంచిన లవ్లీనా కీలకపోరులో చేతులెత్తేసింది.

ప్రత్యర్థి పంచుల వర్షం ధాటికి కనీస పోటీ ఇవ్వకుండానే తలవంచింది. అటు పురుషుల 71 కేజీల విభాగం లో నిషాంత్ దేవ్ కూడా పరాజయం పాలవ్వడం భారత్ అవకాశాలను దెబ్బతీసింది. ఇప్పటికే తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ సహా అమిత్ పంగల్, జాస్మిన్ లంబోరియా, ప్రీతి పవార్‌లు ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. తాజాగా లవ్లీనా, నిషాంత్‌లు కూడా వెనుదిరగడంతో బాక్సర్ల పోరాటం ముగిసినట్లయింది.