తనదైన మార్కు సినిమాలను తెరకెక్కించటం ద్వారా చిత్రసీమలో ప్రముఖంగా ఎదిగిన తెలంగాణ దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా సినీ చరిత్రలో స్థానం దక్కించుకున్నారు ఎన్ శంకర్. కమర్షియల్ మెఇన్ స్ట్రీమ్ ఫార్మాట్‌లోనే తనదైన కమిట్‌మెంట్‌తో సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను రూపొందించారాయన.
శ్రీరాములయ్య, ఎన్‌కౌంటర్, జయం మనదేరా, భద్రాచలం, జై బోలో తెలంగాణ, యమ జాతకుడు వంటి సంచలన విజయాలు సాధించాయి. ముఖ్యంగా 2011లో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’ ఐదు అవార్డులను గెలుచుకుంది. గోవా వేదికగా జరిగిన 6వ దక్షిణాది చలనచిత్రోత్సవంలోనూ ప్రదర్శితమైందీ చిత్రం.
అయితే తాజాగా ఎన్ శంకర్ తనయుడు దినేశ్ మహీంద్ర తండ్రి బాటను ఎంచుకొని, దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. దర్శకత్వ విభాగంలో శిక్షణ పొంది, స్క్రీన్‌ప్లే విషయంలో పలు కోర్సులను పూర్తిచేశాడు. త్వరలోనే దినేశ్ మహీంద్ర దర్శకత్వంలో ఓ అందమైన ప్రేమకథ రూపుదిద్దుకోబోతోంది.
నూతన తారలు, సాంకేతిక నిపుణులను పరిచయం చేస్తూ యూత్‌ఫుల్ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఆరెక్స్ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పాటల రికార్డింగ్స్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు.