calender_icon.png 6 March, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లవ్‌స్టొరీ బిగిన్స్ కొత్త ఒరవడి సృష్టిస్తుంది

04-03-2025 12:00:00 AM

తమిళ నటుడు మిథున్ చక్రవర్తి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ద్విభాషా చిత్రం ‘లవ్ స్టోరీ బిగిన్స్’. తమిళ, తెలుగు భాషల్లో వర్మ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో వర్ష, శ్వేత కథానా యికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘వస్తావా..’ అనే పాట విడుదలైంది. అమర్ గీత్ సంగీత సారథ్యంలో శివమణి రాసిన ఈ పాటను భవదాయిని నాగరాజ్, విద్యుత్ శ్రీనివాస్, థామస్ చిరమేల్ అలెగ్జాండర్ ఆలపించారు.

హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఈ గీతావిష్కరణ కార్యక్రమంలో హీరో మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ.. “నా జీవితంలో జరిగిన యధార్థ సం ఘటనల ఆధారంగా రూపొందిస్తున్న ‘లవ్ స్టొరీ బిగిన్స్’ సినిమా ప్రేమచిత్రాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తుంది. ఈ చిత్రాన్ని ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం” అని తెలిపారు. ‘ఈ చిత్రంలో నటిం చే అవకాశం లభించడం ఆనందంగా ఉంది’ అని పట్ల హీరోయిన్లు వర్ష, శ్వేత చెప్పారు.