calender_icon.png 25 March, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీలంకలో ప్రేమగీతం

24-03-2025 12:28:17 AM

హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మే 30న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి ఇటీవలే రిలీజైన టీజర్‌తో సినీప్రియుల్లో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా మేకర్స్ ఓ అప్‌డేట్ ఇచ్చారు. ఓ పాటను శ్రీలంకలో చిత్రీకరించనున్నట్టు తెలిపారు.  ఈ సాంగ్ షూట్‌లో పాల్గొనేందుకు శ్రీలంక వెళ్లే క్రమంలో హీరో విజయ్ దేవరకొండ ఎయిర్‌పోర్ట్ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. శ్రీలంక షెడ్యూల్ వారం రోజుల పాటు ఉంటుందని, ఓ లవ్ సాంగ్‌ను విజయ్, భాగ్యశ్రీలపై షూట్ చేయనున్నారని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.