calender_icon.png 12 October, 2024 | 10:54 AM

లవ్‌రెడ్డిది స్వచ్ఛమైన ప్రేమ

10-10-2024 12:00:00 AM

అంజన్ రామచంద్ర, శ్రావణిరెడ్డి హీరోహీరోయిన్లుగా నటిసున్న చిత్రం ‘లవ్‌రెడ్డి’. కొన్ని వాస్త వ ఘటనల ఆధారం గా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శ కుడు స్మరణ్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సునంద బీరెడ్డి, హేమలతరెడ్డి, రవీందర్ జి,  మదన్‌గోపాల్‌రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్‌రెడ్డి, నవీన్‌రెడ్డి నిర్మాతలు కాగా.. సుమ, సుస్మిత, హరీశ్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ప్రాణం కన్నా అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. కైలాష్ ఖేర్ పాడిన ఈ పాటకు ప్రిన్స్ హెన్రీ స్వరాలు సమకూర్చగా, కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు.