calender_icon.png 28 December, 2024 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిగ్రీ విద్యార్థినిపై ప్రేమోన్మోది దాడి

04-11-2024 12:52:26 PM

మెదక్,(విజయక్రాంతి): డిగ్రీ విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణం అవుసులపల్లికి చెందిన దివ్య కృప ఓపెన్ డిగ్రీ చదువుతుంది. దీంతో సోమవారం ఉదయం 8 గంటలకు మెదక్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు వెళ్లింది. చైతన్య అనే యువకుడు గత ఆరు నెలలుగా ప్రేమ పేరుతో వేదింపులకు గురి చేస్తున్నాడు.

విద్యార్థిని అతని ప్రేమను తిరస్కరించడంతో కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలో బాధిత విద్యార్థినికి ఈరోజు పరీక్షలు ఉండడంతో ఎక్సామ్ సెంటర్ కు వెళ్తున్న యువతిపై యువకుడు  కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడిలో విద్యార్థిని చేతికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికుల సమాచారంలో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు బాధిత విద్యార్థిని చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.