calender_icon.png 19 April, 2025 | 10:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమాక్షరం దొరికింది

17-03-2025 12:00:00 AM

రకరకాల యాసలు, మాండలికాలతో

గుండెల్ని పడవల్లా ఊరేగించే

తల్లిభాష తెలుగు మాట్లాడుతున్నట్లు

ప్రేమ దొరికింది!

సత్య శరణాగతి శూన్యమైన

రాజకీయంలా కాకుండా

టీ షర్ట్ వేసుకున్న రంగుల 

చిన్నచిన్న చేపల్లా

చెక్కిన రాతి శిల్పాల్లాంటి

గజ ముఖారవిందాల్లా ప్రేమ దొరికింది.

నిస్సహాయతలో దైవనామం దొరికినట్లు

అవమానపు కంటకాలు విసరకుండా

అభిమానపు తివాచీలు పరచే

ప్రేమాక్షరం దొరికింది.

చల్లగా బతకడానికి

కరుణించే ప్రేమ దొరకడం  

గాదెలు వజ్రాల గనులవ్వడం లాంటిది.

తహతహ పన్నీటి చిలకరింపులతో

తడిసిన ముఖచిత్రాలు

మైనపు రూపాలు మాట్లాడుతున్నట్లు

ప్రేమ దొరికింది.. ప్రేమ దొరికింది.. 

ప్రేమాక్షరం దొరికింది

అభిమానం అందింది

ఆనందం హరివిల్లయింది

ఎప్పటికీ విడివడని

అరచేతులు జోడిస్తున్నాను

ప్రేమాక్షర దైవరూపానికి!