calender_icon.png 1 November, 2024 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జార్ఖండ్‌లో లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్

21-07-2024 01:26:12 AM

గిరిజనుల భూములు ఆక్రమిస్తున్న ఒక వర్గం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపణ

రాంచి, జూలై 20: జార్ఖండ్‌లో తమ సొంత భూమల నుంచే గిరిజనులను తరిమేసే పరిస్థితులు వచ్చాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ నడుస్తున్నదని ఆరోపించారు. గిరిజనుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే గిరిజనులకు భద్రత కరువైందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ను పరోక్షంగా విమర్శించారు. శనివారం రాంచీలో నిర్వహించిన బీజేపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని దీమా వ్యక్తంచేశారు. 81 సీట్లున్న అసెంబ్లీలో 52 సీట్ల పరిధిలో గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీయే గెలిచిందని గుర్తుచేశారు. జార్ఖండ్‌లోకి వేలమంది చొరబాటుదారులు ప్రవేశించి అమాయక గిరిజన మహిళలను వివాహం చేసుకొని గిరిజన సర్టిఫికేట్లు సంపాదించి, భూములు కొని స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజన జనాభా, వారి భూములు రక్షించేందుకు జనాభా లెక్కలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు.