కేసు నమోదు చేసిన హయత్ నగర్ పోలీసులు
ఎల్బీనగర్: ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిపై హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పురాణం దీక్షిత (20) బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నది. చెరుకుపల్లి విజయ్ అనే వ్యక్తి తనకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై ప్రెండుగా ఉంటూ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. సరదాగా కలిసి ఉన్న సమయంలో దిగిన ఫోటోస్, విడియోలు అందరికి చూపిస్తా అంటూ వేధిస్తున్నాడు. కాలేజీ నుండి వస్తున్న సమయంలో వెంటపడి, బలవంతమంగా తన బైక్ మీద ఎక్కించుకాని నిర్మానుష్య ప్రదేశం లోకి తీసుకెళ్లి బెదిరించాడు, కోంత కాలంగా ఇంట్లో వాళ్ళ అమ్మతో కూడా కాల్ చేస్తూ బెదిరిస్తున్నాడు, 15వ తేదీన సాయంత్ర సమయంలో ఇంటికే వచ్చి యువతి నాన్నపై దాడికి దిగాడు. యువతి ఫిర్యాదుతో హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.