calender_icon.png 11 March, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమ విఫలమై వ్యక్తి మృతి..

02-02-2025 07:33:16 PM

కొండపాక: ప్రేమించిన అమ్మాయి దక్కలేదని మనస్థాపం చెంది, చెట్టుకు ఉరి వేసుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... కొండపాక గ్రామానికి చెందిన మర్కంటి ప్రశాంత్ (29) బిఈడి వరకు చదువుకొని, పోటీ పరీక్షలకు చదువుకుంటూ, ఇంటి వద్దనే వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటున్నాడు. శనివారం రాత్రి బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళాడు. ఆదివారం ఉదయం ప్రశాంత్ తండ్రి ఎల్లయ్య పాలు పితకడానికి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూసేసరికి చింత చెట్టుకు వేలాడుతూ కనబడ్డాడు. ఇట్టి విషయాన్ని తండ్రి కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు సమాచారం ఇచ్చి వారంతా వచ్చిన తర్వాత ప్రశాంత్ వద్ద ఉన్న సెల్ ఫోన్ ను పరిశీలించారు. అందులో ప్రశాంత్ ఎవరో అమ్మాయిని ప్రేమించినట్టుగా ఉందని తండ్రి పేర్కొన్నాడు. ప్రేమించిన అమ్మాయి దక్కలేదని మనస్థాపానికి చెంది జీవితంపై విరక్తి చెంది క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నట్టు తండ్రి ఎల్లయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.