పహాడీ షరీఫ్‌లో ఘటన
మహేశ్వరం, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ఆ వీధుల్లోకి రయ్..మంటూ ఓ బైక్ దూసుకొచ్చింది. ప్రియుడు బైక్ నడుపుతుండగా.. ప్రియురాలు పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చొని ప్రియుడిని కౌగిలించుకున్నది. ఆమె అంతటితో ఆగలేదు.. బైక్ వేగంగా వెళ్తుండగానే ప్రియుడికి ఘటైన ముద్దులు ఇచ్చింది. నిస్సిగ్గుగా ఆరుబయట ముద్దులు పెట్టుకోవడాన్ని చూసిన స్థానికులు ముక్కున వేలేసుకున్నారు.
ఈ దృశ్యం బుధవారం పహాడీ షరీఫ్ ప్రాంతంలో కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. వీడియో నగర పోలీసులకు చేరిందని, వారు ఆ ప్రేమ జంట ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిసింది.