ఒలింపిక్స్ కేవలం పతకాలు సాధించిన వారికి మాత్రమే కాకుండా కొంత మంది ప్రేమికులకు కూడా మరుపురాని అనుభూతులను మిగులుస్తోంది. అర్జెంటీనాకు చెందిన హ్యాండ్‌బాల్ ఆటగాడు పాబ్లో, ఆ జట్టు హాకీ క్రీడాకారిణి మారియా ఒలింపిక్స్ వేదికగా ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా పాబ్లో మొకాళ్లపై కూర్చొని మారియా వేలికి ఉంగరం తొడిగి లవ్ ప్రపోజ్ చేశాడు. మొదట ఆశ్చర్యపోయినప్పటికీ తనపై ఉన్న ప్రేమను అర్థం చేసుకున్న మారియా ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.