calender_icon.png 16 January, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమ ఒక్కటే సరిపోదు..

17-09-2024 12:00:00 AM

ప్రేమబంధంతో మనసులు కలిశాయనుకుంటే సరిపోదు. దాన్ని నిలబెట్టుకోవడానికి ఇద్దరూ కృషి చేస్తేనే ఆ బంధం శాశ్వతం అవుతుందంటున్నారు నిపుణులు. ప్రేమలో పడటం తేలికగానే ఉంటుంది. ఇరువురు ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఆ సమయాన్ని సంతోషంగా గడిపేస్తారు. ప్రేమను గెలిపించుకొని ఏడడుగులు నడిచిన తర్వాత కొత్త కాపురం రంగులమయంగా అనిపిస్తుంది. మధురమైన ఆ ప్రేమ బంధానికి రెండో భాగం మొదలవుతుంది. అయితే ఆ తర్వాత దాన్ని శాశ్వతం చేసుకోవాల్సిన బాధ్యత ఇద్దరిపై ఉంటుంది.

మొదట్లో ఉండే ప్రేమను కలకాలం ఉండేలా నిలబెట్టుకోవడానికి భార్యాభర్తలిద్దరూ కృషి చేయాలి. ఎదుటివారిని అర్ధం చేసుకోవడం ప్రారంభించాలి. వారి బలాలు, బలహీనతలను గుర్తించి గౌరవించాలి. ఆ బంధానికి కట్టుబడి, దాన్ని శాశ్వతం చేసుకోవడానికి మరెన్నో రెట్లు కష్టపడాల్సి వస్తుంది. ఇరువురూ తమకంటూ సమయాన్ని కేటాయించుకోవాలి. సంతోషాన్ని మాత్ర మే కాకుండా, జీవితంలో వివిధ దశల్లో వచ్చే సవాళ్లను కూడా కలిసి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సమస్య వచ్చినప్పు డు బాధ్యతగా స్వీకరించి పంచుకొని, చర్చించాలి. అలా ఒకరి కోసం మరొకరు అన్నట్లు మనసులు ముడిపడి, ఇద్దరి మధ్య ప్రేమ బంధం శాశ్వతమవుతుంది.