calender_icon.png 11 January, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులకు ప్రభుత్వం చేయూత

04-01-2025 10:09:17 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): దివ్యాంగులకు, అంధులకు ప్రభుత్వం చేయూతనిస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) తెలిపారు. అంధుల కోసం లూయిస్ బ్రేల్ ప్రత్యేకంగా బ్రెయిలీ లిపి(Braille Lipi)ని కనుగొన్న అక్షర ప్రధాత అని అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో లూయిస్ బ్రెల్(Louis Braille) 216వ జన్మిదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ... అంధులు విద్యను అబ్యాసించుటకు బ్రెయిలీలో అక్షరాలను కనుగొన్న వ్యక్తి అని అన్నారు.

ఎన్నికల్లో అంధులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్‌ను కూడా ఎన్నికల కమీషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రత్యేకంగా గ్రంథాలయం ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ వారిచే బ్రెయిలీ లిపిలో ప్రచురించబడిన బ్రేల్ క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, సిడిపివో రోచిషమ్మ, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.