అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్...
నిజామాబాద్ (విజయక్రాంతి): బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయి విగ్రహానికి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చెప్పులు కుట్టే కుటుంబంలో జన్మించి, రెక్కడితే గాని కడుపు నిండని పరిస్థితుల్లో చిన్న వయసులో ప్రమాదవశత్తు కంటి చూపు కోల్పోయిన చదువుకోవాలనే తపనే ఈ రోజు ప్రపంచం గర్వించదగ్గ మహోన్నత శక్తిగా ఏదిగిన వ్యక్తి లూయి అని కొనియాడారు. నగరంలోని స్నేహ సొసైటీలో నిర్వహించిన లూయి బ్రెయిలీ 216వ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన చీకటి సూర్యుడు లూయిస్ బ్రెయిలీ అని తనతో పాటు తోటి అంధులైనవారి జీవితాల్లో వెలుగులు నింపాలనే తపనతో అంధుల కోసం ప్రతేక లిపిని నిర్మించడని, ఇది గొప్ప విషయం అన్నారు.
బ్రెయిలీ లిపిని అంధులకు ఒక గొప్ప విద్య ప్రధానం చేసిన మహనీయుని దినోత్సవాన్ని జనవరి 4 ప్రపంచ బ్రెయిల్ దినోత్సవంగా మనం ఈ రోజు జరుపుకోవడం చాలా సంతోషకరం అని ఎమ్మెల్యే అన్నారు. అటువంటి మహనీయుడు బ్రతికి ఉన్నప్పుడు అతని లిపిని గుర్తించలేదని చనిపోయిన తరువాత గుర్తించిన, ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా బ్రెయిల్ లిపిని అభివృద్ధి చేసి అంధులందరికి ఉచితంగా విద్య అందించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవం అన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థులందరు కూడా లూయిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయిలో నిలవాలని అన్నారు.
నేడు వివిధ ప్రభుత్వ శాఖల్లో అంధులు ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఆనాడు లూయి అందించిన లీపి అని గుర్తుచేసారు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్న సంకల్పం గట్టిగ ఉంటే అనుకున్న లక్ష్యం తప్పకుండ చేరుకుంటాం కాబట్టి మీరు ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని రాణించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నుండి తగిన సహాయ సహకారాలు అందేవిధంగా కృషి చేస్తానని అంధుల హక్కులైన విద్య, వైద్యం అందించే దిశగా ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ స్కూల్ సెక్రటరీ, సిద్దయ్య, రసూల్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ప్రతిమరాజ్ తదితరులు పాల్గొన్నారు.