నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో ప్రభుత్వ పథకాల ఎంపికకు నిర్వహిస్తున్న వార్డు సభల్లో పెద్ద ఎత్తున ప్రజలు పథకాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. పట్టణంలోని 42 వార్డులో వార్డు అధికారుల సమక్షంలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఆయ వార్డులో వివిధ రాజకీయ పార్టీల నేతలు యువకులు పేదలకు రేషన్ కార్డు తదితర పథకాల కోసం అర్జీలను సమర్పించుకుంటున్నారు. పట్టణంలోని పలు వార్డులలో మున్సిపల్ చైర్మన్ గంట ఈశ్వర్ మున్సిపల్ అధికారులు హరి భూషణ్ దరఖాస్తులను స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జువైద్ అహ్మద్ ఇమ్రానుల తదితరులు ఉన్నారు.