బడి అమ్మ ఒడి లాంటిది: వక్తలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (విజయక్రాంతి): గౌతమినగర్ డాక్టర్స్ కాలనీ లోని లోటస్ నేషనల్ స్కూల్ 20వ వార్షికోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్ ఉమారెడ్డి, సీఐ గోపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి సమాజానికి అనుగుణంగా ఆటపాటలతో కూడిన విద్యనందిం చాలని సూచించారు.
పాఠశాలలో అమ్మ ఒడిని తలపించేలా వాతావరణం ఉందని, సీబీఎస్‌ఈ విద్యతోపాటు వివిధ రంగాల్లో ముందుకు వెళుతున్న ఆ పాఠశాల అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జానకీ దేవి, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.