calender_icon.png 16 November, 2024 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమల పట్టు సడులుతోంది!

11-09-2024 12:11:12 AM

ప్రముఖ పోల్ అనలిస్ట్ నెట్ సిల్వర్

న్యూయార్క్, సెప్టెంబర్ 10: అమెరికాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. అభ్యర్థులిద్దరూ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ యూఎస్‌లో పట్టు కోల్పోతున్నట్లు ప్రముఖ పోల్ అనలిస్ట్ నేట్ సిల్వర్ వెల్లడించారు. వారం రోజుల్లోనే కమలా పాపులారిటీ గణనీయంగా తగ్గిందని, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ బలంగా పుంజుకున్నట్లు ఆయన తెలిపారు. న్యూయార్క్ టైమ్స్  సియాన కాలేజ్ పోల్స్‌ను విశ్లేషిస్తూ సిల్వర్ బులెటిన్ పేరుతో రాసిన బ్లాగ్‌లో పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరోను కాదని, మిన్నోసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌ని వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎంపిక చేయడమే కమలా చేసిన భారీ తప్పిదమని సిల్వర్ అభిప్రాయపడ్డారు. పెన్సిల్వేనియా లాంటి ప్రతిష్ఠాత్మక రాష్ట్రం డెమోక్రాంట్ల చేజారే పరిస్థితి ఉందని తెలిపాడు. అక్కడ 19 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.