- డెమోక్రాట్ పార్టీలో సరికొత్త రాజకీయం
- బైడెన్ వైదొలగడంతో పార్టీలో భిన్నాభిప్రాయాలు
- కమలాహ్యారిస్ అభ్యర్థిత్వంపై అనుమానాలు
- మితవాద అభ్యర్థులకు అవకాశమివ్వాలని వినోద్ ఖోస్లా సూచన
వాషింగ్టన్, జూలై 22: అగ్రరాజ్య అధ్యక్ష బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో అమెరికా రాజకీయాల్లో ట్విస్టులు ఉచ్ఛస్థితికి చేరుకున్నాయి. బైడెన్ వైదొలుగుతూ తన వారసురాలిగా, డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమలాహ్యారిస్‌ను ప్రతిపాదించారు. కొన్ని రోజులుగా బైడెన్ ఆరోగ్య స్థితిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ డెమోక్రటిక్ నేతలు ఆయన ఆభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కమలకు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఇప్పుడు బైడెన్ నిష్క్రమించిన వేళ కమల అభ్యర్థిత్వంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతిచ్చే విషయంలో వ్యాపారవేత్తలు ఎలాన్ మస్క్, భారత సంతతికి చెందిన వినోద్ ఖోస్లా మధ్య సోమవారం మాటల యుద్ధం జరిగింది. మస్క్ ఎప్పటి నుంచో ట్రంప్‌కు మద్దతు ప్రకటిస్తుండగా ఖోస్లా మాత్రం వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
మస్క్ వ్యాఖ్యలతో వివేక్ వ్యాఖ్యలు వైరల్
మస్క్ మరో ట్వీట్‌లో రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ బైడెన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమని పేర్కొ న్నారు. గతంలో వివేక్ మాట్లాడుతూ.. బైడెన్‌కు సొంత పార్టీలోనే నమ్మకం లేదని, వచ్చే ఎన్నికల్లో ఆయన అభ్యర్థిగా ఉండకపోవచ్చని చెప్పారు. డెమోక్రాట్స్ తరఫున కమలాహ్యారిస్ లేదా మిచెల్ ఒబామా బరిలో ఉంటారని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా మస్క్ గుర్తు చేయడంతో వివేక్ చేసి వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా ట్రంప్ మాత్రం బైడెన్ కన్నా కమలను ఓడించడమే సులభమని వ్యాఖ్యానించారు. బైడెన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఆయన అధ్యక్ష పదవికి తగిన వ్యక్తి కాదని ఆరోపించారు. ఆ హోదాలో పనిచేసే అర్హత బైడెన్‌కు లేదని, మీడియా, వైద్యుల సహాయంతో పనిచేయడం అసంభవమని అన్నారు.
చందాల లొల్లి
అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ వైదొలగడంతో డెమోక్రాట్లలో ఉత్సాహం పెరిగింది. ఆయన కమల పేరును అభ్యర్థిగా ప్రకటించడంతో డెమోక్రాట్లకు చందాలు ఒక్కసారిగా జోరందుకున్నాయి. కమలా బృందం కూడా వెంట నే ప్రచార చందాల కోసం సానుభూతిపరులకు మెయిల్స్ పంపడం మొదలుపెట్టింది. డెమోక్రాట్ల తరఫున విరాళాలు వసూలు చేసే యాక్ట్ బ్లూ సంస్థ గంటల్లోనే 46.7 మిలియన్ డాలర్లను సమీకరించింది. 2024 ఎన్నికల విరాళాల సేకరణలో ఇదే ఒక్కరోజు అత్యధికం కావడం విశేషం. కమలా పేరు ప్రకటించగానే చిన్న మొ త్తాల్లో వచ్చిన విరాళాలే 27.5 మిలియన్ డాల ర్లు వచ్చినట్లు యాక్ట్ బ్లూ ప్రకటించింది. కమలను బైడెన్ అధికారికంగా నామినేట్ చేస్తే కానీ ఆ నిధులు వాడుకోవడానికే వీల్లేదని వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ ఆమె నామినేట్ కాని పక్షం లో బైడెన్, కమల నిధులు మొత్తం డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి చెందుతాయని వివరిస్తున్నా రు. ఆ మొత్తాన్ని డెమోక్రటిక్ పార్టీ ఎన్నుకొన్న అభ్యర్థిపై ఎన్నికల్లో ప్రకటనలు, ఇతర అవసరాలకు వినియోగించే అవకాశం ఉంటుంది.
మస్క్ X వినోద్
మస్క్, ఖోస్లా ఇరువురి మధ్య ఎక్స్‌లో ఘాటు చర్చకు తెరతీసింది. ట్రంప్‌కు మద్దతివ్వాలంటూ మస్క్ చేసిన పోస్ట్‌పై వినోద్ ప్రశ్నించారు. ట్రంప్ విలువలు లేని వ్యక్తి అని అబద్ధాలు చెప్పి, మహిళలను కించపరిచి, రేప్ చేసే వ్యక్తిత్వం గలవాడని వినోద్ ఆరోపించారు. బైడెన్ వైదొలిగిన నేపథ్యంలో ఆయనకు మించిన మితవాద నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరముందని వినోద్ డెమోక్రాట్లకు పిలుపునిచ్చారు. అందుకోసం బహిరంగ సదస్సు నిర్వహించా లని డిమాండ్ చేశారు. ట్రంప్‌ను ఓడించగలిగే నాయకుణ్ని ఎంపిక చేయాలని హితవు పలికారు. కొ న్ని రాష్ట్రాలకు గవర్నర్లుగా వ్యవహరిస్తున్న విట్మర్, షాపిరో ను అభ్యర్థులుగా సూచించారు. ట్రంప్ అతివాదంలో అమెరికా బందీ కాకుం డా ఉండాలంటే వీరే సరైన వ్యక్తులని స్పష్టం చేశారు. వినోద్ ట్వీట్‌కు స్పం దించిన మస్క్.. ట్రంప్, వాన్స్ అభ్యర్థిత్వాలకు మద్దతునివ్వాలని కోరడంతో ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు.