పొద్దు తిరుగుడు మొక్క చూడటానికి ఎంత అందంగా ఉంటుందో.. దాని విత్తనాలు ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తాయి. పొద్దు తిరుగుడు నూనెను వంటకాల్లో ఉపయోగిస్తారు. అయితే వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం..
* పొద్దు తిరుగుడు విత్తనాలు గుండెకు చాలా ఉపయోగపడతాయి. అంతే కాకుండా వీటిని తినడం వల్ల బరువు తగ్గుతారు.
* పొద్దు తిరుగుడు విత్తనాలలో విటమిన్ ఇ, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
* పొద్దు తిరుగుడు గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ గింజలను తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఆకలిని తగ్గించడంలో బాగా పని చేస్తుంది. తద్వారా బరువు అదుపులో ఉంటుంది.
* పొద్దు తిరుగుడు విత్తనాలలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. అంతే కాకుండా చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఉండటానికి సహాయపడుతుంది.
* ఈ గింజల్లో క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో ఉపయోగపడతాయి.
* పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ బి, సెలీనియం ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడం లో సహాయపడతాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం తో పాటు మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి.