విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండ లం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద కారులో ప్రయాణిస్తున్న తండ్రీకూతురు ఆకేరు వాగు వరద ఉధృతికి కారుతో సహా గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా గేటు కారేపల్లి గంగాపురం గ్రామానికి చెందిన మోతీలాల్ ఆయన కూతురు అశ్విని కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఢిల్లీలో సైంటిస్ట్‌గా పని చేస్తున్న అశ్విని తండ్రితో కలిసి హైదారబాద్ విమనా శ్రయానికి కారులో బయలుదేరగా మార్గమధ్యంలో ప్రమాదం చోటుచేసు కుంది.
గాలింపు చేపట్టగా అశ్విని మృత దేహాం లభ్యమైంది. మోతీలాల్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తా డ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన జెరి పోతుల మల్లికార్జున్ పశువు లు మేపేందుకు వెళ్లి ఇంటికి తిరిగొస్తుండ గా కాల్వలో పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మం త్రి సీతక్క ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. మధిర మం డలం దెందుకూరులో పద్మావతి అనే మహిళ వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందింది. ఖమ్మం రూరల్ మండలం తీర్ధాల వద్ద ఆకేరులో ఒక బాలుడు సహా అయిదుగురు గల్లంతయ్యారు. వారిని తీర్ధాలకు చెందిన మధు, వీరబాబు, బన్నీ, గోపీలుగా గుర్తిం చారు.
కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో ఒకే కుటుంబానికి చెందిన యాకూబ్, షరీఫ్, సైదాబీ వరద నీటిలో గల్లం తయ్యారు. ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి వద్ద చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 9మంది వరద నీటిలో చిక్కు కుపోయారు. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసులు ప్రయత్నించారు. రెండు హెలీ కాప్టర్లను హైదరాబాద్ నుంచి తెప్పించారు. వాతావారణ సహకరించ కపోవడంతో వాటి వల్ల ఉపయోగం లేకుండా పోయింది. సహాయ చర్యలు చేపట్టడంలో ఆలస్యం చేస్తుండడంతో ఖమ్మం త్రీ టౌన్‌లో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు.
నాగర్‌కర్నూల్ జిలా తాడూరు మండలం ఐతోలు, సిరుసవాడ గ్రామాల మధ్య దుందుబీ వాగు ఉధృతికి అదేగ్రామానికి చెందిన కప్పటి అంజ నేయులు, చిన్నమల్లయ్య అనే ఇద్దరు గొర్రెల కాపరులు తమ 150 గొర్రెలతోపాటే జలది గ్బందంలో చిక్కుకున్నారు. రెండురోజులుగా అక్కడే ఉండ డంతో విషయం గ్రామస్తుల ద్వారా తెలు సుకుని కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్ నేరుగా సహాకచర్యల్లో పాల్గొ న్నారు. పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావు పల్లిలోనూ రామ స్వామి, రామకృష్ణ, రేణుక అనే ముగ్గురు గొర్రెల కాపరులను జాలర్లు, పోలీసులు పడవ సాయంతో కాపాడారు.
పెద్దపల్లి జిల్లా లోని కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేట, కొత్తపల్లి రహదారి మార్గంలో వరదలో మీర్జంపేట కారోబార్ సూర్య, పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ పవన్ బైక్‌పై పోతుండగా పవన్ కొట్టుపోయాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో వాగులు నిండు కొని ప్రవహిస్తుండటంతో ఒక యువకుడు గల్లంతయ్యాడడు. సూర్యాపేట కోదాడ పట్టణంలోని హుజుర్‌నగర్ రోడ్డులో కోదాడ పట్టణం గాంధీనగర్‌కు చెందిన రవి కుమార్ నీటి ప్రవాహానికి కారుతో సహా కొట్టుకపోగా మృతి చెందాడు. అదే ప్రాంతంలో వరద నీటిలో పడి వెంకటేశ్వర్లు కొట్టుకుపోయి మృతి చెందారు.