calender_icon.png 23 October, 2024 | 3:58 AM

మాయమైన మనిషి!

23-10-2024 02:06:59 AM

తంగళ్లపల్లిలో..

  1. భారమని బతికుండగానే బంధం తెంచుకున్నారు
  2. వృద్ధురాలిని శ్మశానంలో వదిలిపెట్టిన బంధువులు
  3. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో అమానవీయం  

సిరిసిల్ల, అక్టోబర్ 22 (విజయక్రాంతి): మలిదశలో వృద్ధురాలిని భారమనుకొని, బరువు దించుకొనేందుకు బతికుండగానే శ్మశానవాటిక తరలించిన అమానవీయ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో మంగళవారం వెలుగుచూసింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి గ్రామానికి చెందిన కూకట్ల రాజవ్వ స్థానికంగా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలుగా పని చేస్తుంది. రాజవ్వకు సంతానం లేకపోవడం, ఇటీవలే భర్త అనారోగ్యంతో మృతిచెంద డంతో దిగులుతో మంచం పట్టింది. అద్దె ఇంట్లో ఉంటున్న రాజవ్వను కొద్ది రోజుల క్రితం ఆమె అన్న ఇంటికి తీసుకెళ్లి సేవలందించారు.

ఈ క్రమంలో రాజవ్వకు సేవలు చేసేందుకు ఇబ్బందిపడ్డ బంధువులు.. ఆమెను వదిలించుకునేందుకు దగ్గరలో ఉన్న శ్మశానవాటికలో వదిలిపెట్టారు. అప్పటికే కదల్లేని, మాట్లాడలేని స్థితిలో ఉన్న రాజవ్వ దుస్థితిని చూసినవారు కంటతడి పెట్టారు.

స్థానికుల ద్వారా విషయం తెలుసుకొన్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, రాజవ్వను తిరిగి తన అన్న ఇంటికి చేర్చా రు. ప్రస్తుత పరిస్థితుల్లో రక్త సంబంధాలకు విలువ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతు న్నా యని స్థానికంగా చర్చసాగుతోంది.

తంగెడపల్లిలో..

  1. ఆస్తిలో వాటా ఇవ్వాలని భార్య తరఫు బంధువుల ఆందోళన 
  2. ఐదు రోజులుగా అనాథగా భర్త మృతదేహం
  3. మృతుడి తల్లిదండ్రులు అల్లుడి పేర భూమి రిజిస్ట్రేషన్ చేయడంతో కొడుకు అత్మహత్య

సంగారెడ్డి, అక్టోబర్ 22 (విజయక్రాంతి)/ సదాశివపేట : ఆస్తి పంపకాలు చేసి, అంత్యక్రియలు చేయాలని ఐదు రోజులుగా భర్త మృతదేహంతో భార్య బంధువులు ఆందోళన చేస్తున్నారు. సం గారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలోని తంగెడపల్లిలో గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

తంగెడపల్లి గ్రామానికి చెందిన సిరిపురం మాణయ్య, సిరి పురం మాణమ్మలకు ఇద్దరు కొడుకులు రాములు. నవీన్, కూతురు రజిత ఉన్నా రు. మాణయ్య, మాణమ్మ తమ పేరుపై ఉన్న మూడు ఎకరాల భూమిని కుమార్తె రిజిత భర్త మల్లేశం పేరుపై రిజిస్టేషన్ చేశారు. భూమి రిజిస్ట్రేషన్ చేసిన విష యం తెలుసుకొని కుమారుడు రాములు (32)  తల్లిదండ్రులను ప్రశ్నించాడు.

తల్లిదండ్రులు  భూమి ఇవ్వకపోవడంతో రాములు మనస్తాపానికి గురై ఈ నెల 18న గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామ స్తులు తెలిపారు. రాములు ఆత్మహత్య చేసుకోవడంతో రాములు భార్య తరఫు బంధువులు ఐదు రోజులుగా ఆస్తిలో వాటా ఇస్తేనే అంత్యక్రియలు చేస్తామని ఆందోళన చేస్తున్నారు.

సదాశివపేట సర్కార్ దవాఖాన పోస్టుమార్టం గదిలో మృతదేహం ఉంచి, మృతు డి  భార్య తరఫు బంధువులు ఆం దోళనకు దిగారు. మృతుడి భార్య లక్ష్మి గర్భవతి కావడంతో ఆస్తిలో వాటా ఇవ్వాలని బంధువులు ఆం దోళన చేస్తున్నారు. మృతదేహం ఉన్నప్పుడే ఆస్తి పంపకాలు చేయాలని బంధువులు డిమాండ్ చేస్తు న్నారు. 

అల్లుడు మల్లేశంపై రిజిస్ట్రేషన్ చేసిన భూమిని తిరిగి మృతుడి భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేయిస్తామని గ్రామ పెద్దలు మాట ఇచ్చినా అమలు కాలేదని తెలిపారు. ధరణిలో స్లాట్ బుక్ చేసి ముందు ఒప్పుకున్న ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు.

ఆల్లుడు మల్లే శం ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో మృతదేహానికి అంత్యక్రియలు చేయకూడదని తెలిపారు.  మృతు డు రాములు బావమరిది రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని సదాశివపేట సీఐ మహేశ్‌గౌడ్ తెలిపారు.