24-02-2025 03:21:25 PM
చిట్యాల,(విజయక్రాంతి): పోగొట్టుకున్న రెండు మొబైల్ ఫోన్లను సోమవారం బాధితులకు అందజేసినట్లు చిట్యాల సిఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన శ్రీ బరన్ రెడ్డి 3 నెలల క్రితం వన్ ప్లస్ మొబైల్ ని పోగొట్టుకొన్నారు. చిట్యాల మండల కేంద్రానికి చెందిన గోల్కొండ సతీష్ నెల క్రితం రియల్ మీ ఫోన్ ని పోగొట్టుకొని పోలీస్ స్టేషన్లో తమ మొబైల్ ఫోన్లు పోయాయని దరఖాస్తు అందజేసినట్లు చెప్పారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందించడం జరిగిందని తెలిపారు.
అట్టి మొబైల్ ఫోన్స్ ని గుర్తించడంలో సహాయపడిన కానిస్టేబుల్ లాల్ సింగ్ ను సిఐ అభినందించారు. ప్రజలకి ఎవరికైనా మొబైల్స్ దొరికితే పోలీస్ స్టేషన్ లో అప్పచ్చెప్పలని, ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మొబైల్స్ ని సులువుగా గుర్తించవచ్చన్నారు. దొరికిన మొబైల్స్ తమ వద్ద ఉంచుకోకుండా పోలీస్ స్టేషన్ లో అప్పగించి మంచి మనుసు చాటుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల ఎస్ఐ శ్రావణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.