calender_icon.png 7 February, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విత్తనాలతో రైతులకు నష్టం

07-02-2025 07:22:14 PM

బైంసా (విజయక్రాంతి): కుబీర్ మండలంలోని ఆయా గ్రామాల్లో యాసంగిలో సాగుచేసిన మొక్కజొన్న ఎదిగినప్పటికీ కంకులు రాకపోవడంతో మొక్కజొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయా గ్రామాల్లో పయనీర్ 35 పి నంబర్ గల మొక్కజొన్న విత్తనాలను సాగు చేసినప్పటికీ ప్రస్తుతం కంకులు ఏర్పడడంతో తమకు తీవ్రంగా నష్టం జరిగిందని లక్ష్మణ్ పటేల్ రాము పటేల్ రాణి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలన చేసి తమకు పరిహార అందించేలా చర్యలు తీసుకోవాలని వారు విన్నవిస్తున్నారు.