calender_icon.png 2 November, 2024 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ, హైడ్రాలతో కాంగ్రెస్‌కు నష్టం

02-11-2024 12:00:00 AM

బీజేఎల్పీ నేత ఏలేటి 

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచి త పనులు ఆ పార్టీకి నష్టం కలిగిస్తున్నాయ ని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో మీడియా తో చిట్‌చాట్ నిర్వహించారు. సీఎం రేవంత్ 7సార్లు ఢిల్లీకి వెళ్లినా ఆయనకు రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ లభించలేదన్నారు.

రేవంత్‌రెడ్డికి కౌంట్‌డౌన్ మొదలైందని, ఆయనపై రాష్ట్రం లోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు సైతం గుర్రుగా ఉన్నారని తెలిపారు. మూసీ ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.50 వేల కోట్ల నుంచి రూ.లక్షన్నర కోట్ల పెంచడం వెనక భారీ స్కామ్ ఉన్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోందన్నారు. అందుకే కాంగ్రెస్ రేవంత్‌ను దూరం పెడుతోందని ఏలేటి తెలిపారు.

రాష్ట్రం లో కొనసాగుతున్న వ్యవహారాలపై ఆ రా తీసేందుకు అధిష్ఠానం ఆదేశం మే రకు డీకే శివకుమార్ ఫోన్ చేసినా రేవంత్ లిఫ్ట్ చేయలేదని, ఈ విషయాన్ని మీడియా చిట్ చాట్‌లో రేవంతే ఒప్పుకున్నారని అన్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన మూసీ పరివాహక రైతులతో మీటింగ్ పెడితే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుకాలేదని తెలిపారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారిందన్నారు.