సర్‌చార్జ్ బకాయిల పేరుతో బంద్ చేయడం సరికాదు: రైతులు
మహబూబాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): విద్యుత్ సర్‌చార్జీ బకాయిలు కట్టని కొంతమంది కో సం విద్యుత్ శాఖ అధికారులు విద్యు త్ సరఫరా నిలిపివేయడం సరికాదని కేసముద్రం మండల రైతులు ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవా రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో రైతులు మీడియాతో మాట్లాడారు. కేసము ద్రం మండల పరిధిలో కొన్ని గ్రా మాల్లో కొందరు రైతుల నుంచి సర్‌చార్జీల బకాయిల వసూళ్ల కోసం వ్య వసాయ మోటార్లకు విద్యుత్ సరఫ రా నిలపివేయడంతో యాసంగి పం టకు ఆటంకం కలుగుతుందని అన్నారు.