calender_icon.png 19 April, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘లూజ్’ దందా

19-04-2025 02:09:28 AM

  1. ఇష్టానుసారంగా అనుమతి లేని వ్యాపారాలు
  2. టీ పొడి దగ్గర నుంచి కారం వరకు...
  3. కనిపించని ఐఎస్‌ఐ మార్క్
  4. పట్టించుకోని ఫుడ్ సెఫ్టీ అధికారులు

సూర్యాపేట, ఏప్రిల్18(విజయక్రాంతి): జిల్లా కేంద్రంతో పాటు ప్రదాన పట్టణాలు అక్రమ వ్యాపారాలకు అండాగా మారుతు న్నాయి. పట్టణంలో అనుమతిలేని వ్యాపా రులు కో కొల్లలుగా సాగుతున్నాయి. నిషేదించిన గుట్కాల దగ్గర నుంచి బెల్లం వరకు గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారులు అమ్ముతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే అనుమతి వ్యాపారులు చేసే ‘లూజ్’ దందా కలువరపెడుతున్నది.

నిత్యవసర వస్తువు లలో కొన్నింటిని  ఇతర రాష్ట్రాలలో బల్క్గా కొనుగోలు చేసి  వాటిలో కల్తి పదార్దలు కలిపి చిన్న ప్యాకెట్లు గా మార్చుతూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ప్యాంకింగ్ సమయంలో అనుమతి లేని సొంత బ్రాండ్ల పేరుతో విడదల చేసేవారు కొందరైతే గుర్తిం పు పొందిన ప్రముఖ బ్రాండ్ల పేరుతో మ రికొందరు కల్తికి పాల్పడుతున్నట్లు సమా చారం. గుట్టు చప్పుడు కాకుండా కొనసాగు తున్న ఈ దందా అధికారుల కనుసన్నేలలో సాగుతున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. 

టీ పొడి దగ్గర నుంచి...

అక్రమ వ్యాపారుల చేసేవారికి అది..ఇది అనే తేడా లేదు దాదాపు అన్ని పదార్దలను బల్క్గా లూజ్ కొనుగోలు చేసి ప్యాంకింగ్ చేస్తున్నారు.. వంట నూనెలు, కొబ్బరి నూనెలు, టీ పౌడర్, పసుపు, కుంకుమ, కారంపొడి, ఉప్పు వంటి పదార్దలను తక్కువ ధరకు బల్క్గా కొనుగోలు చేసి 50 గ్రాములు, 100 గ్రాములు, 250గ్రాములు, 500 గ్రాములు, 1 కేజి ప్యాకెట్లుగా మార్చు తున్నారు. సొంత కంపేనీల పేరుతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.

మరి కొందరైతే  గుర్తింపు కల్గిన మార్కెట్ అధిక గిరాకి గల కంపెనీల పేరుతో విడుదల చేస్తున్నారు. ప్యాకింగ్ సమయంలో రంగు, రుచి, కొరకు  ఆరోగ్యానికి హాని కల్గించే రసాయనాలను కల్పుతున్నట్లు సమాచారం. దీంతో పాటు కొన్ని కొన్ని  పదార్దలలో తవడు, రంపంపొడిల కలిపుతున్నట్లు తెలుస్తున్నది. నూనెలలో ఎముకల ద్వారా తయారు చేసిన కల్తి నూనెలను కలుపుతు న్నట్లు సమాచారం. 

పట్టించకోని అధికారులు

ఇంతా జరుగుతున్న అధికారులు చోద్యం  చూస్తున్నారు. ఆరోపణలు రాలేదు, ఫిర్యాదులు అందలేదు... అందితే చర్యలు తీసుకుంటామని సాకులు చేపుతున్నారు. నెలకు ఆరు శాంపిల్ల పరిశీలన పేరుతో ఏదో ఒక దుకాణంలో పప్పు, ఉప్పులను సేకరించి ల్యాబ్లకు పంపి చేతులు దులుపుకుంటున్నారు.

ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారులు ఆటలాడుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ఈ సందర్భంగా  కోరుతున్నారు.