calender_icon.png 22 December, 2024 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని దొంగగా అవతారం

08-10-2024 12:50:59 AM

నిందితుడి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 7: మహిళ మెడలోని పుస్తెలతాడు దొంగిలించిన కేసు లో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నా యి.. బొంత అనిల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి చంపాపేట్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. పీజీ పూర్తిచేసిన అనిల్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు, చెడు వ్యసనాలకు అలవాటు పడి భారీగా డబ్బు పోగొట్టు కున్నాడు.

దీంతో తెలిసిన వ్యక్తుల వద్ద, లోన్ యాప్‌ల నుంచి అప్పు తీసుకున్నాడు. తిరిగి  చెల్లించాలని వారి నుంచి ఒత్తిడి రాడంతో తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుం డా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై అత డి తల్లిదండ్రులు స్థానిక స్టేషన్‌లో మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు. అనంతరం ఆచూకీ తెలిశాక తల్లిదండ్రులు.. అప్పు డబ్బులు అంతా చెల్లించారు.

అనిల్ ఆ తర్వా త లాల్ దర్వాజలోని శ్రీచైతన్య పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా చేరాడు. కొంతకా లం తర్వాత మళ్లీ బెట్టింగ్‌లు మొదలు పెట్టా డు. ఆ తర్వాత కూడా భారీగా డబ్బులు నష్టపోయాడు. చివరగా సులువుగా డబ్బులు సంపాదించేందుకు మహిళల మెడలో నుంచి బంగారం దొంగిలించేందుకు పథకం వేశాడు.

అందులో భాగంగానే ఈ నెల 4న ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ గ్రామానికి చెందిన మొద్దు భారతమ్మ పొలం వద్ద పశువులను మేపుతుండగా 3 తులాల బం గారు పుస్తెలతాడును లాక్కొని ఉడాయించాడు. ఈ విషయమై భారతమ్మ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిఘా పెట్టారు.

సోమవారం మధ్యాహ్నం నిందితుడు బైక్‌పై ఇబ్రహీంపట్నం సాగర్ హైవే రోడ్డు వైపు వెళ్తుండటాన్ని గుర్తించి అరెస్ట్ చేశారు. అతని నుంచి 29.300 గ్రాముల బంగారు గొలుసు, అదేవిధంగా పహడీషరీఫ్ స్టేషన్ పరిధిలోని గతంలో దొంగతనం చేసిన 42.500 గ్రాముల గొలుసు, ఒక మొబైల్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసు లు తెలిపారు.