కోళ్ల దానతో వెళ్తుండగా కిష్టారెడ్డిపేట్ వద్ద ఓఆర్‌ఆర్ పై ఘటన
పటాన్ చెరు, జనవరి 24 : అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డి పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదవశాత్తు లారీ దగ్ధమైంది. శుక్రవారం ఉదయం మహారాష్ట్ర నుంచి విశాఖపట్టణం కోళ్ల దానతో వెళ్తుండగా కిష్టారెడ్డి పేట్ వద్ద లారీ టైర్ లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై లారీని పక్కన పార్క్ చేశాడు.
మంటలు క్రమంగా మొత్తం అంటుకోవడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు పటాన్ చెరు నుంచి ఫైర్ ఇంజన్ తో వచ్చి మంటలను ఆర్పి వేశారు. పటాన్ చెరు పోలీసులు ప్రమాదం స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.