09-04-2025 12:00:00 AM
హోంగార్డు మృతి, ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు శేరిలింగం
పల్లి, ఏప్రిల్ 8: మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హోంగార్డు సింహాచలం, కానిస్టేబుళ్లు రాజవర్ధ న్, విజేందర్ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మియాపూర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 600 వద్ద విధులు నిర్వహిస్తున్నారు.
అదే సమయంలో కూకట్‌పల్లి భరత్‌నగర్‌లో బియ్యం బస్తాలను అన్‌లోడ్ చేసిన ఓ లారీ.. మియాపూర్ వైపు అతివేగంగా వచ్చి అదుపుతప్పి ట్రా ఫిక్ బూత్‌ను ఢీకొట్టి, అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బందిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
మదీనా గూడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సింహా చలం మృతి చెందారు. ఇద్దరూ కానిస్టేబుళ్లను మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ సదాశిపేటకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. మృతుడు సింహాచలం స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస.