11-02-2025 10:41:33 PM
కోదాడ (విజయక్రాంతి): మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో ఓపస్ బ్రిక్స్ కంపెనీ ముందు లారీ ఓనర్లు,డ్రైవర్లు పురుగు మందు బాటిలతో నిరసన తెలుపుతూ మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులు మల్లెల నారాయణ మాట్లాడుతూ.. సంవత్సరం కాలం నుండి బ్రిక్స్ లోడ్స్ తోలుతున్న అర కొర డబ్బులు చెల్లిస్తూ మొత్తం డబ్బులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 14 లక్షలు వరకు డబ్బులు చెల్లించాలని గట్టిగా అడగడంతో వేరే లారీ లతో బ్రిక్స్ తరలిస్తున్నారని తమకు తక్షణమే న్యాయం చేయకపోతే చావే దిక్కని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.