కల్వకుర్తి: అధిక లోడ్ తో వెళ్తున్న లారి కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.