calender_icon.png 20 March, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదుపుతప్పి ఆటోను ఢీకొట్టిన లారీ

19-03-2025 12:00:00 AM

యువకుడు దుర్మరణం.. పలువురికి గాయాలు

మిర్యాలగూడ, మార్చి8 (విజయక్రాంతి):  వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందగా డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్నగర్ శివారులోని సాంబశివ రైస్మిల్లు సమీపం మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. 

అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన కాటం ఆంజనేయులు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సాయంత్రం కుటుంబీకులతోపాటు మిర్యాలగూడలోని లారీ అసోసియేషన్ కార్యాలయం నుంచి ఓ యువకుడిని ధీరావత్ తండా క్రాస్రోడ్డు వద్ద దించేందుకు వెళ్లాడు. క్రాస్రోడ్డు వద్ద ఆటో నిలుపుతుండగా వేగంగా దూసుకొచ్చిన లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

దీంతో ఆటో బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న బీహార్కు చెందిన కృష్ణకుమార్ (22) తీవ్రగాయాలై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆంజనేయులుతోపాటు అతడి కుటుంబీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ లోకేశ్ తెలిపారు.