calender_icon.png 9 January, 2025 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారును ఢీకొట్టిన లారీ

02-12-2024 12:49:47 AM

భార్యాభర్తల మృతి

హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదం

చేవెళ్ల, డిసెంబర్ 01: చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడగేట్ సమీపంలో హైదరాబాద్  జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొట్టిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. చేవెళ్ల పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాలు.. శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూర్ గ్రామానికి చెందిన మేరకల లక్ష్మారెడ్డి(58), భాగ్యలక్ష్మి(55) దంపతులు ఆదివారం దేవరంపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి కారులో వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో మీర్జాగూడగేట్ సమీపంలో వారి కారును లారీ ఢీకొట్టడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.