22-03-2025 12:00:00 AM
మహబూబాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం పెద్ద నాగరం శివారులో ఖమ్మం వరంగల్ హైవే పై ఓ లారీ ఆటోను ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. తొర్రూర్ మండలంలోని చెర్లపా లెం, పత్తేపురం గ్రామానికి చెందిన 17 మంది కూలీలు మిర్చి ఏరేందుకు మరిపెడ బంగ్లా వైపు ఆటోలో వెళ్తున్నారు.
తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పెద్ద నాగారం సమీపంలో మూల మలుపులో ఆటోను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో రోడ్డు పక్కకి పల్టీ కొట్టింది. ఘటనలో ఉన్న 16 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చెర్లపాలెంకు చెందిన అరుణ మృతి చెందింది. స్థానికుల సహాయంతో 108 కు ఫోన్ చేయడంతో నర్సింహులపేట, నెల్లికుదురు, మరిపెడ మండలాల 108 అంబు లెన్స్ వాహనాల్లో క్షతగాత్రులను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.