15-03-2025 12:00:00 AM
ఆటో డ్రైవర్ మృతి..ఏడుగురికి గాయాలు..
కామారెడ్డి, మార్చి 14 (విజయక్రాంతి) ః ప్రయాణికులతో వెళుతున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొనడంతో ఆటో బోల్తా పడి నా ఘటన కామారెడ్డి జిల్లా టేక్కిరి యల్ పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో త్రీ వీలర్ ఆటో ప్రయాణికులతో కామారెడ్డి వైపు నుంచి నిజాంబాద్ వైపు వెళుతుండగా వెనుక నుంచి వస్తున్న తమిళనాడు కు చెందిన లారీ డ్రైవర్ తన వాహనాన్ని అతివేగంగా అజాగ్రత్తగా నడిపి ఢీకొనడంతో ఆటో బోల్తా పడి నట్లు దేవుని పల్లి ఎస్‌ఐ రాజు తెలిపారు.
ఆటో డ్రైవర్ తో పాటు మరో ఏడుగురు ప్రయాణికులు ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసే లోపే డ్రైవర్ మృతి చెందినట్లు ఎస్సు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు ప్రయాణికులు గాయపడినట్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్ ఐ పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సు తెలిపారు.