calender_icon.png 13 January, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్వకుర్తిలో లారీ బీభత్సం...!

12-01-2025 11:16:10 PM

రోడ్డు పక్కన నిలుచున్న యువకుల పైకి దూసుకెళ్లిన వైనం

యువకుడు మృతి... మరొకరి పరిస్థితి విషమం

కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణంలో రోడ్డు పక్కన నిలుచున్న ఇద్దరు యువకుల పైకి దూసుకెళ్తూ లారీ బీభత్సాన్ని సృష్టించింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... కల్వకుర్తి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మాయని నాగరాజు (32), వంగూరు మండలం కోనేటిపురం గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాసులు ఇద్దరు పట్టణంలోని సిల్వర్ జూబ్లీ క్లబ్ వద్ద ఓఅద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వెల్దండ మండలం రాచూర్ గ్రామ పరిధిలో వెంటేజ్ కాఫీ కంపెనీలో షిఫ్ట్ ఇంచార్జీలుగా పనిచేస్తున్నారు.

ఆదివారం రాత్రి భోజనం కోసం బయటికి తమ స్కూటీపై వెళ్లేందుకు ఫుట్పాత్ పై నిలబడి ఉండగా దేవరకొండ నుండి జడ్చర్ల వైపు వెళ్తున్న లారీ విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టి ఇద్దరు యువకులపైకి దూసుకెళ్ళింది. దీంతో నాగరాజు అక్కడికక్కడే మృతిచెందగా తన స్నేహితుడు తీవ్రగాయాల పాలయ్యారు. స్కూటీ సైతం లారీ టైర్ల కింద నలిగింది. వెంటనే స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.