మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహదేవపూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఉన్న దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు(Duddilla Sripadarao) విగ్రహాన్ని ఢీ కొట్టి లారీ బీభత్సం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుండి ఇసుక తీసుకు వెళ్ళుటకు వస్తున్న లారీ డ్రైవర్ నిద్ర మత్తుతో జాతీయ రహదారి పైన ఉన్న మాజీ స్పీకర్ శ్రీపాదరావు(Former Speaker Sripada Rao) విగ్రహాన్ని ఢీకొట్టడంతో పక్కనే బస్ కోసం ఎదురుచూస్తున్న గట్టు సందీప్ (25 ) కు విగ్రహం పక్కన ఉన్న బండరాయి వచ్చి తలకు తలగడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు పక్కనే ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తరలించి ప్రథమ చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి(Warangal MGM Hospital)కి తరలించారు. లారీని డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.