calender_icon.png 9 January, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముషీరాబాద్ ఎక్స్ రోడ్డులో లారీ బీభత్సం

30-12-2024 10:06:40 AM

హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్ ఎక్స్ రోడ్(Musheerabad X Road)లో లారీ బీభత్సం సృష్టించింది. పార్కింగ్ లోని వాహనాలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. లారీ దూసుకెళ్లిన ఘటనలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.