calender_icon.png 4 March, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీ - ఆర్టీసీ బస్సు ఢీ.. డ్రైవర్ మృతి

09-12-2024 06:25:50 PM

నల్గోండ,(విజయక్రాంతి): నల్గోండ జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ వద్ద హైదరాబాద్- విజయవాడ రహదారిపై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ డీలక్స్  బస్సు, లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ అక్కడికక్కడే  మృతి చెందగా, ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నల్గోండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, డ్రైవర్ సలీంగా పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి.