calender_icon.png 6 April, 2025 | 1:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ బియ్యం తరలిస్తున్న లారీల పట్టివేత

05-04-2025 08:38:41 PM

అందోలు: సంగారెడ్డి జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న రెండు లారీలను పుల్కల్ పోలీసులు పట్టుకున్నారు. పక్క సమాచారంతో నేషనల్ హైవే 161 వ జాతీయ రహదారిపై చౌటకూర్ మండలం తాడ్దాన్ పల్లి టోల్ గేట్ వద్ద పుల్కల్ ఎస్సై క్రాంతి సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుండి గుజరాత్ రాష్టానికి అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న రెండు లారీలను గుర్తించి వాటిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. చీకటి దందా చేస్తున్న అక్రమ బియ్యం మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. యదేచ్చగా జాతీయ రహదారిపైనే అక్రమ బియ్యం రవాణా జరుగుతుండడంతో ప్రజలు విస్మయం  చెందుతున్నారు.