calender_icon.png 7 January, 2025 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరుశురాముడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన రామయ్య

05-01-2025 02:11:24 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి(Bhadrachalam Sri Seetha Ramachandra Swamy Temple) వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అధ్యాయనోత్సవాలలో భాగంగా 6వ రోజు స్వామివారు పరశురామావతారంలో ముస్తాబై భక్తులకు దర్శనమిచ్చారు. పరశురామావతార  రూపుడైన స్వామివారిని ఆలయ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి అనంతరం మాడ వీధుల గుండా ఊరేగింపుగా  వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మిథిలా స్టేడియం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలోకి తోడ్కొని వచ్చి ఆశీనులు చేశారు.

అనంతరం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి సిబ్బంది వేద పండితులు అర్చకులు పాల్గొన్నారు. పరశురామ అవతారం విశిష్టత... శ్రీ మహా విష్ణువు జమదగ్ని అనే మహర్షికి కొడుకుగా జన్మించి, పరశురాముడు అని పిలవబడుతూ దుష్టులైన కార్త వీర్యార్జునని, దుర్మార్గులైన రాజులను 21 మార్లు  దండెత్తి సంహరించాడు. ధర్మాన్ని స్థాపించాడు. శుక్రగ్రహ బాధలున్నవారు ఈ అవతారాన్ని దర్శించడం వలన శుభ ఫలితాలను పొందుతారు అని భక్తుల విశ్వాసం.