పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
కామారెడ్డి, ఫిబ్రవరి 2( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయం లో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు వడ్డేపల్లి.
వడ్డేపల్లి సుభాష్ రెడ్డి రూ. 2.18 లక్షలు ఆలయానికి విరాళంగా అందజేశారు. అనంతరం ఆలయం లో నిర్వహించిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వామి యొక్క మూల విరాట్ స్పర్శ దర్శనం చేసుకున్న అనంతరం వేద పండితుల సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకులు శాలువాతో సన్మానించారు.
ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఆలయ నిర్మాణానికి పలువురు విరాళాలు ఇచ్చిన వారిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు రాజు లింగారెడ్డి నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.