కూకట్ పల్లి,(విజయక్రాంతి): నలభై ఒక్క రోజుల పాటు కఠిన నియమాలతో అయ్యప్ప దీక్షను పూర్తి చేసుకున్న అయ్యప్ప స్వాములు మణికంఠుని దర్శనం కోసం శబరి యాత్రకు బయలుదేరారు. కూకట్ పల్లి వివేకానంద నగర్ లోని అయ్యప్ప స్వామి ఆలయంలో శబరిమల యాత్రకు బయలుదేరే అయ్యప్ప స్వాములు ముందుగా అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు యోగేశ్వర శర్మ గురు స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారణ దీక్ష స్వాములకు ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు.
గురువారం ఇరుముడి కట్టుకున్న మలాదారుణదీక్ష స్వాములు గురు స్వామి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సన్నిధానం స్వాములు శ్రీధర్ గురుస్వామి, శ్రీకాంత్ గద స్వామి, కన్నె స్వాములు మల్లేష్ స్వామి, అనిల్ కుమార్ స్వామిలు అయ్యప్ప శబరి యాత్రకు బయలుదేరారు. అనంతరం ఇరుముడిని తలపై పెట్టి యాత్రను ప్రారంభించారు. ఇరుముడిని తలపై పెట్టుకున్న స్వాములు స్వామి శరణాలు చేస్తూ... ముందుకుసాగారు. కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఇరుముడి కార్యక్రమానికి హాజరై అయ్యప్ప స్వామి కృపకు పాత్రులయ్యారు. అనంతరం వీరికి భక్తులు, మహిళలు, బంధువులు మంగళహారతులతో ఘనంగా సాగనంపారు.