calender_icon.png 24 October, 2024 | 2:53 AM

లోన్ పేరుతో లూటీ!

24-10-2024 12:45:04 AM

  1. ష్యూరిటీ ఉన్నారని బెదిరిస్తారు
  2. రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు  
  3. పరిచయస్తులకు ఫోన్లు చేసి విసిగింపు
  4. అకౌంట్ చెక్ చేయాలని వివరాల సేకరణ
  5. ఆపై నగదు కాజేస్తున్న మాయగాళ్లు

మంచిర్యాల, అక్టోబర్ 23 (విజయక్రాం తి) : మేము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామనో.. సీబీఐ, ఇతర పోలీసు అధికారుల మనో ఫోన్లు చేసి డబ్బులు కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు తాజాగా కొత్త దారిని ఎంచుకున్నా రు. ఫలానా వారు లోన్ తీసుకున్నారు.. ష్యూరిటీలో మీ పేరు ఉందంటూ కొత్త తర హా బెదిరింపులకు దిగుతుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.

కాగా, టెలీకాలర్స్ చెప్తున్న వారికి ఫోన్ చేసి ఆరా తీస్తే తాము ఎలాంటి లోన్ తీసుకోలేదని, ఆ బ్యాంకుల్లో ఖాతాగానీ, పర్సనల్ లోన్ గానీ లేదా ఇతర క్రెడెట్ కార్డులు ఏమీ లేవని చెప్పడంతో షాకవుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

రుణం కట్టాలంటూ వేధింపులు 

లోన్ రికవరీ ఏజెన్సీల పేరిట ఫోన్లు చేస్తు న్న టెలీకాలర్స్ ఆగడాలు హద్దులు మీరుతున్నాయి. లోన్లు, క్రెడిట్ కార్డుల బిల్లు బకా యిల వసూళ్ల బాధ్యతను ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు థర్డ్ పార్టీ ఏజెన్సీలకు అప్పగిస్తున్నాయి. దీంతో ఆయా ఏజెన్సీల టెలీకాలర్స్ రుణ గ్రహీతలకు ఫోన్లు చేస్తున్న విషయం విదితమే. ఇదంతా సాధారణంగా జరిగే ప్రక్రియ.

కానీ లోన్ తీసుకున్న వారు ఫోన్లు ఎత్తకున్నా లేదా వారు టైంకు బిల్లులు, ఈ ఎంఐలు చెల్లించకున్నా వారికి పరిచయము న్న వారికి కూడా ఈ ఏజెన్సీల టెలికాలర్స్ ఫోన్లు చేస్తూ విసిగిస్తున్నారు. ఫలానా వ్యక్తి మిమ్మల్ని ష్యూరిటీగా పెట్టారంటూ టెలీకాలర్స్ ఫోన్లు చేసి విసిగిస్తున్నారు. తాము ఎవరికీ ష్యూరిటీ ఇవ్వలేదని, రెఫరెన్స్ కూడా ఇవ్వలేదని, వారెవరో మాకు తెలియదని చెప్తున్నా టెలీకాలర్స్ వినిపించుకోవడం లేదు.

ఫోన్ చేసి సదరు వ్యక్తు లు బిల్లులు, ఈఎంఐలు కట్టకుంటే మీరే చెల్లించాల్సి ఉంటుందని, లేకపోతే లీగల్ నోటీసులు పంపిస్తామని, జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుందని బెదిరింపులకు గురిచేయడంతోపాటు బూతులు తిడుతున్నారు. దీని తో లోన్ తీసుకున్న వారికి సంబంధం లేని వ్యక్తులు భయాందోళనకు గురవుతున్నారు.

సింగరేణి కార్మికుడికి ఫోన్..

మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ సింగరేణి కార్మికుడికి ఓ ప్రైవేటు బ్యాంకులో పర్సనల్ లోన్ ఉండగా, ఆ లోన్‌కు సంబంధించి చెల్లింపులు సక్రమంగానే జరుగుతున్నాయి. అయితే, ఇటీవల హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ బ్రాంచి నుంచి అధికారులమం టూ టెలీకాలర్స్ సదరు కార్మికుడి బంధువులకు ఫోన్లు చేస్తున్నారు. 

లోన్ తీసుకున్నది సింగరేణి కార్మికుడి కుమారుడని, రెఫరెన్స్ / ష్యూరిటీలో మీ పేరు ఉందని, అతడు లోన్ చెల్లించడం లేదంటూ బంధువులకు ఫోన్ చేసి విసిగిస్తున్నారు. దీనితో వారు కార్మికుడి కుమారుడికి ఫోన్ చేసి ఆరా తీయగా.. తాను ఏ బ్యాంకు లో లోన్ తీసుకోలేదని, ఎలాంటి క్రెడిట్ కార్డు తీసుకోలేదని, సదరు బ్యాంకులో అకౌంట్ కూడా లేదని స్పష్టతనిచ్చాడు.

అదే సమయంలో టెలీకాలర్స్ చెప్పిన బ్యాంకులో సంప్రదించగా.. మీ పేరుతో ఎలాంటి లోన్లు లేవని అధికారులు చెప్తున్నారు. మరి ఇలా కాల్స్ రావడం ఏంట ని ప్రశ్నించగా తాము కూడా తెలుసుకుంటామని, ఆ నంబర్లు ఇవ్వాలంటూ బ్రాంచి మేనేజర్ చెప్పడం గమనార్హం.

1930.. నో హెల్ప్ 

సైబర్ నేరాలకు గురైతే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ తరహా కాల్స్ గురించి ఫిర్యాదు చేసేందుకు 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే ఎలాంటి స్పందన ఉండటం లేదు. 1930లో కేవలం సైబర్ మోసాలకు గురైన వారు, సైబర్ వేధింపులకు గురైన వారి ఫిర్యాదులు మాత్రమే రిజిస్టర్ అవుతున్నా యి.

లోన్ లేకున్నా ఉన్నదంటూ వేధిస్తున్న టెలీకాలర్స్ గురించి ఫిర్యాదులు తీసుకోవ డం లేదు. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేసినా ఎలాంటి సహాయం అందడం లేదు. మరోవైపు ఫోన్ కాల్స్ ఆగడం లేదంటూ బాధితు లు వాపోతున్నారు.

డబ్బులు కాజేసే యత్నమా?

ఎవరైనా లోన్ తీసుకుంటే వారికి ఫోన్ చేసి రికవరీ టీం అంటూ ఫోన్ చేస్తే పర్వాలేదు. కానీ, ఎలాంటి లోన్ తీసుకోని వారికీ రికవరీ టీం అంటూ వేధింపులకు గురిచేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఒకరి నుంచి మరొకరి వివరాలు తెలుసుకొని వారి బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు కాజేసే యత్నమా అనే సందేహాలు కలుగుతున్నాయి.

ఎలాంటి లోన్ లేని వారికి ఫోన్లు చేసి బెదిరించడం, విసిగించడం ద్వారా సదరు వ్యక్తులు అసహనానికి గురయ్యేలా చేసి.. బాధితుల ఒరిజినల్ బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకొని, డబ్బులు కొట్టేసే ప్రయత్నమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెలీకాల ర్స్ ఫోన్ల టార్చర్‌కు ఆవేశంలో తొందరపడి ఎవరైనా వివరాలు చెబితే ఆ బ్యాంకు ఖాతాలు లూటీ చేయడం ఖా యమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.   

స్పామ్ కాల్స్ లేపవద్దు 

సైబర్ క్రైం ద్వారా ఎవరైనా తమ అకౌంట్లో నుంచి డబ్బులు నష్టపోతే వెంట నే 1930కు ఫోన్ చేయాలి. అలా కాకుండా కొందరు టెలీ కాలర్స్ ఆన్‌లైన్ ద్వారా ఫోన్‌లు చేసి ఇబ్బంది పెడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. దానికి 1930లో ఎలాంటి ఆప్షన్‌లేదు. బాధితులు అలాంటి స్పామ్ కాల్స్ వస్తే వాటిని లిఫ్ట్ చేయకుండా ఉం డటం మేలు.

లిప్ట్ చేసి నా వారి మాటలు నమ్మకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఫోన్ కట్ చేయాలి. అయినా ఇబ్బంది పెడుతుంటే సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సైబర్ వింగ్ వారి సలహాలు పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకు అకౌంట్ వివరాలు, ఓటీపీలు చెప్పవద్దు. 

 శ్రీనివాసులు, 

పోలీస్ కమిషనర్, రామగుండం