calender_icon.png 7 October, 2024 | 6:02 PM

హర్షసాయిపై లుకౌట్ నోటీసులు

06-10-2024 12:00:00 AM

రాజేంద్రనగర్, అక్టోబర్ 5: యూట్యూబర్ హర్షసాయిపై నార్సిం గి పోలీసులు శనివారం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతడు విదేశాల కు పారిపోయే అవకాశం ఉందని బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఇటీవల హర్షసాయిపై లైంగిక దాడి, మో సం ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసిన యువతి సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కలిసింది.

ఇదిలా ఉండ గా, మెగా సినిమా కాపీ రైట్స్ కోసం హర్షసాయి వేధించాడని కూడా బాధితురాలు తన ఫిర్యాదులో పే ర్కొంది. బాధిత యువతి ఫిర్యాదు చేసినప్పటి నుంచి హర్షసాయి పరారీలో ఉండ టం గమనార్హం. అతడి కోసం నార్సిం గి పోలీసులు గాలిస్తున్నారు.